ఎన్టీఆరే ఉదాహరణ.. కేసీఆర్‌కూ అదే గతి పడుతుంది: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్
- జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎన్టీఆర్ సొంత రాష్ట్రంలో బోల్తా పడ్డారు
- వచ్చే ఎన్నికల్లో ఇదే సీన్ రిపీటవుతుంది
- తెలంగాణలో ఒంటరి పోరే
2019 ఎన్నికల్లో మళ్లీ ఇలాగే జరగడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ను తోక పార్టీ అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాంగ్రెస్‌తో సంబంధాలున్న నేతలను ఎందుకు కలుస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనుమతితోనే ఆయన అంతమందిని కలవగలుగుతున్నారని, ఆయన పర్యటనలు మొత్తం కాంగ్రెస్‌కు లాభం చేకూర్చేలా ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలో ఒంటరిగానే బరిలోకి దిగుతామన్న లక్ష్మణ్ జూన్ నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు.