అదే జరిగితే కొడుకని కూడా చూడను.. కుమారస్వామిని హెచ్చరించిన దేవెగౌడ!
- బీజేపీతో కుమారస్వామి కలిస్తే కుటుంబం నుంచి వెలేస్తా
- జేడీఎస్‌పై కుట్ర జరుగుతోంది
- కాంగ్రెస్‌వి దిగజారుడు రాజకీయాలన్న దేవెగౌడ
కర్ణాటకలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమేనని పలు సర్వేలు చెప్పాయని గుర్తు చేసిన ఆయన, అందుకే జేడీఎస్‌పై కుట్ర జరుగుతోందన్నారు. బీజేపీకి జేడీఎస్ బీ టీమ్ అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఆరోపించడాన్ని తప్పుబట్టారు. అమిత్ షాతో కలిసి కుమారస్వామి విమానంలో ప్రయాణించారన్న వార్తల్లో నిజం లేదన్నారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, ఆధారాలు ఉంటే సిద్ధరామయ్య విడుదల చేయాలని సవాలు విసిరారు. కుమారస్వామి కనుక బీజేపీతో చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తే కొడుకని కూడా చూడకుండా ఇంటి నుంచి వెళ్లగొడతానని, ఇంటి నుంచి, పార్టీ నుంచి వెలేస్తానని దేవెగౌడ హెచ్చరించారు.