జగపతిబాబు రూట్లో రాజశేఖర్ .. ఖాయమైపోయినట్టే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగపతిబాబు రూట్లో రాజశేఖర్ .. ఖాయమైపోయినట్టే!

  • రామ్ తో ప్రవీణ్ సత్తారు 
  • విదేశాల్లో షూటింగ్ 
  • కీలకమైన పాత్రలో రాజశేఖర్
'గరుడ వేగ' సినిమా సూపర్ హిట్ అయిన తరువాత, కథల ఎంపికలో రాజశేఖర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్త దర్శకుడితో కలిసి త్వరలోనే ఆయన సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ సినిమాలోనూ ఒక కీలకమైన పాత్రను చేయడానికి ఆయన అంగీకరించాడని అంటున్నారు.

 రామ్ హీరోగా స్రవంతి మూవీస్ బ్యానర్లో ప్రవీణ్ సత్తారు ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా షూటింగును ఎక్కువ భాగం విదేశాల్లో జరపనున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం రాజశేఖర్ ను ఎంపిక చేశారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఇది విలన్ పాత్ర కూడా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. తాను విలన్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమేనని గతంలో రాజశేఖర్ తెలిపిన సంగతి తెలిసిందే. మొత్తానికి జగపతిబాబు రూట్లో రాజశేఖర్ కూడా కొనసాగనున్నారన్న మాట.        
rajasekhar

More Telugu News