నెక్స్ట్ మూవీ గురించి త్వరలో చెబుతానంటోన్న నివేదా థామస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెక్స్ట్ మూవీ గురించి త్వరలో చెబుతానంటోన్న నివేదా థామస్

  • నివేదా థామస్ కి యూత్ లో మంచి క్రేజ్ 
  • చదువు కారణంగా కొంత గ్యాప్ 
  • మళ్లీ కథలు వింటోన్న నివేద
తెలుగు తెరకి పరిచయమవుతూనే వరుస విజయాలను అందుకున్న కథానాయికల జాబితాలో నివేదా థామస్ కూడా కనిపిస్తుంది. 'జెంటిల్ మేన్' .. 'నిన్నుకోరి' సినిమాల ద్వారా యూత్ కి .. ఫ్యామిలీ ఆడియన్స్ కి పరిచయమైన నివేదా, 'జై లవకుశ' సినిమాతో మాస్ ఆడియన్స్ ను కూడా అలరించింది.

ఆ తరువాత ఆమె కొన్ని రోజుల పాటు సినిమాలను దూరం పెట్టి, తాను చేస్తోన్న కోర్స్ కి సంబంధించి లాస్ట్ సెమిష్టర్ పై దృష్టి పెట్టింది. ఆ సెమిష్టర్ పూర్తికావడంతో మళ్లీ తన తదుపరి సినిమాల కోసం కథలు వినడం మొదలుపెట్టేసింది. తనకి నచ్చిన స్క్రిప్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తన తదుపరి సినిమాకి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆమె చెబుతోంది. ఇక నివేదా ఏ స్టార్ హీరోల జోడీగా ఛాన్సులు కొట్టేస్తుందో .. ఎన్నేసి సక్సెస్ లు పట్టేస్తుందో చూడాలి.    
Niveda Thomas

More Telugu News