'సవ్యసాచి' ఆ స్థాయి వసూళ్లను రాబట్టాల్సిందే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సవ్యసాచి' ఆ స్థాయి వసూళ్లను రాబట్టాల్సిందే!

  • 'సవ్యసాచి'గా నాగచైతన్య 
  • దర్శకుడిగా చందూ మొండేటి 
  • భారీ వసూళ్ల పైనే దృష్టి      
మాస్ యాక్షన్ సినిమాలు చైతూకు పెద్దగా కలిసి రాలేదు. అందువలన యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని .. మాస్ అంశాలను జోడించుకుని ఆయన 'సవ్యసాచి'గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో చైతూ పాత్ర డిఫరెంట్ గా ఉండనుంది.

 ఈ సినిమాకి ముందు చైతూ చేసిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సక్సెస్ ను ఇచ్చింది. దాదాపు 25 కోట్ల వరకూ ఈ సినిమా వసూలు చేసింది. దాంతో 'సవ్యసాచి' సినిమా 30 కోట్లకి పైగా వసూలు చేయాలనే ఉద్దేశంతో చైతూ వున్నాడట. ఆ స్థాయి వసూళ్లు సాధించినప్పుడే ఈ సినిమా హిట్ చిత్రాల జాబితాలోకి చేరినట్టుగా అవుతుందనేది ఆయన అభిప్రాయమట. అందువలన ఈ సినిమాతో చైతూ ఆశించే హిట్ ఇవ్వాలనే పట్టుదలతో చందూ మొండేటి వున్నాడని అంటున్నారు.      
nagachaitanya

More Telugu News