బాలకృష్ణ ఏ ఏసీ రూములో కులుకుతున్నారు?: సినీనటి కవిత
- హీరోలు ఏసీ రూముల్లో కులుకుతున్నారన్న ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
- మండిపడ్డ సినీ నటి కవిత
- ఎన్టీఆర్ కూడా హీరోనే అనే విషయాన్ని మర్చిపోవద్దు
హైదరాబాదులోనే ఉంటూ బానిస బతుకులు బతుకుతున్నారంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా దారుణమని కవిత అన్నారు. ఇప్పటికీ నారా లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మణిలు హైదరాబాదులోనే ఉన్నారని... వారు కూడా బానిస బతుకు బతుకుతున్నట్టేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడకో, విశాఖపట్నానికో, రాజమండ్రికో, గుంటూరుకో, కాకినాడకో ఎందుకు షిఫ్ట్ కాలేదని... రెండేళ్లు ఆయన హైదరాబాదులోనే ఉన్నారని... మీరు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు కూడా బానిస బతుకు బతికినట్టేనా? అని అన్నారు.