sandalwood: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ భర్తపై కన్నడ సినీ నటి ఫిర్యాదు!

షార్ట్స్‌లో చూడండి
తన భర్త శాడిజాన్ని తట్టుకోలేకపోతున్నానని ప్రముఖ కన్నడ నటి చైత్ర బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లిక్కర్ వ్యాపారి, రియల్టర్ బాలాజీ పోతరాజ్ తో నాకు 2006లో వివాహమైంది. గత నెల రోజులుగా ఆయన వేధింపులను భరించలేకపోతున్నాను. ఎక్కడకు వెళ్లినా గన్ మెన్ ను నా వెంట పంపుతున్నాడు. ఈనెల 14న చిన్న విషయానికి గొడవపడి నాపై దాడి చేశాడు. తలను గోడకేసిన కొట్టాడు. నోరు, ముక్కు నుంచి రక్తం కారుతున్నా పట్టించుకోలేదు. తనను హత్య చేయాలనుకున్నాడు. గొంతు పట్టుకుని పొట్ట, ఇతర భాగాలపై దాడి చేశాడు. నేను స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లో వదిలిపెట్టి వెళ్లాడు. అమూల్య అనే యువతితో నా భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

తనను తొలగించుకునేందుకు తన భర్త వేధింపులకు దిగుతున్నాడని చైత్ర తెలిపింది. ప్రస్తుతం తన పుట్టింట్లో ఆశ్రయం పొందుతున్నానని చెప్పింది. తన భర్తపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. 
Go Back to Shorts
sandalwood
actress
chaitra
husband
harrasment

More Telugu News