బాబూ రాజేంద్రప్రసాద్.. సినీ పరిశ్రమపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయొద్దు!: తమ్మారెడ్డి భరద్వాజ
- పదవి ఉంది కదా అని వ్యాఖ్యలు చేయకండి
- చాలామంది సినిమా వాళ్లు టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు
- ముందుగా వాళ్లతో ప్రకటనలు ఇప్పించండి
ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ, చాలామంది సినిమా వాళ్లు టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని, ముందు వాళ్లతో ప్రకటనలు ఇప్పిస్తే, ఆ తర్వాత మిగతావారు మాట్లాడతారని అన్నారు. ఇటీవల నంది అవార్డులను ఎవరికి బడితే వాళ్లకిచ్చేశారు కదా! ఆ అవార్డులు తీసుకున్నవాళ్లతో ప్రత్యేకహోదా విషయమై ముందు మాట్లాడించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజేంద్రప్రసాద్ తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు కనుకనే తాను ఈవిధంగా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు.