టీడీపీలో చేరాలంటూ మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు.. రక్షణ కల్పించండి: జనసేన విజ్ఞప్తి
- పోలీస్ ఉన్నతాధికారులు స్పందించాలి
- టీడీపీ ఎమ్మెల్యే చాంద్ బాషాపై ప్రతి విమర్శలు చేయడంతో కదిరిలో దాడి
- మరోచోట టీడీపీలో చేరాలని పెనుకొండ మాజీ జెడ్పీటీసీ సభ్యుడి అనుచరుల దాడి
- ఆరోపణలు చేసిన జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి
తమ పార్టీకి చెందిన 40 మందిపై కదిరి పోలీస్ స్టేషన్‌లో అక్రమ కేసులు పెట్టించి, వారిని పోలీసులతో తిట్టించారని అన్నారు. అదే విధంగా జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరాలని పెనుకొండ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తన అనుచరులతో తమ కార్యకర్తలపై దాడి చేయిస్తున్నారని అందులో పేర్కొన్నారు.