ఆసక్తిని రేపుతోన్న 'సవ్యసాచి' ఫస్టులుక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసక్తిని రేపుతోన్న 'సవ్యసాచి' ఫస్టులుక్

  • 'సవ్యసాచి'గా నాగచైతన్య 
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • జూన్ 14వ తేదీన సినిమా రిలీజ్  
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'సవ్యసాచి' చిత్రం రూపొందుతోంది. ఫస్టు పంచ్ పేరుతో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్టులుక్ పోస్టర్ లో చైతూ రఫ్ లుక్ తో చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు. ఆయన హావభావాలకు అద్దం పడుతూ .. ఆయన అనుబంధాలను ఆవిష్కరిస్తూ ఈ పోస్టర్లో అనేక చేతులు కనిపిస్తున్నాయి. ఆ చేతులపై ఏవో అంకెలు .. గుర్తులు .. పేర్లు టాటూలుగా కనిపిస్తున్నాయి.

కొన్ని చేతులు హీరో ఆవేదనను .. మరికొన్ని చేతులు ఆయన ప్రేమ పూర్వక స్వభావాన్ని ఆవిష్కరిస్తున్నాయి. మరికొన్ని చేతులు పిడికిలి బిగించి ఆయనలోని పోరాట పటిమను చాటి చెబుతున్నాయి. కథానాయకుడి స్వభావాన్ని ఈ కాన్సెప్ట్ తో చందూ మొండేటి రిలీజ్ చేసిన తీరు బాగుంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, జూన్ 14వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.      
nagachaitanya
nidhi

More Telugu News