ఏపీకి ప్రత్యేక హోదా పేరిట నాటకాలాడుతున్న జగన్ : జేడీ శీలం

  • బీజేపీతో చీకటి ఒప్పందాన్నిజగన్ బహిర్గతం చేయాలి
  • కేంద్రంపై అవిశ్వాసం పెడతామంటూ జగన్ డ్రామాలు సరికాదు
  • ఏ మార్గంలో ప్రత్యేక హోదా సాధిస్తారో జగన్ బహిరంగ పరచాలి
  • మీడియాతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శీలం
ఏపీ విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామంటున్న వైసీపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేడీ శీలం విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదా సాధన పేరిట నాటకాలు ఆడుతున్న జగన్ వాటిని కట్టిపెట్టాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామంటూ వైసీపీ అధినేత జగన్ డ్రామాలాడుతున్నారని, బీజేపీతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాన్నిజగన్ బహిర్గతం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదని చెబుతున్న జగన్, ఏ మార్గంలో ప్రత్యేక హోదా సాధిస్తారనే విషయాన్ని బహిరంగంగా చెప్పాలని శీలం డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
jd seelam

More Telugu News