పవన్ ను రప్పించే ప్రయత్నంలో సాయిధరమ్ తేజ్
- కరుణాకరన్ దర్శకత్వంలో ప్రేమకథాంశం
- హిట్ కొట్టాలనే పట్టుదలతో తేజు
- కథానాయికగా అనుపమ పరమేశ్వరన్
ప్రమోషన్స్ పరంగాను ఈ సినిమాను మరింతగా జనంలోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో వున్నాడు. అందువల్లనే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి పవన్ కల్యాణ్ ను ముఖ్య అతిథిగా రప్పించాలని ఆలోచనలో వున్నాడట. ఎందుకైనా మంచిదని ఇప్పటి నుంచే అందుకు సంబంధించిన ప్రయత్నాలు మొదలుపెట్టాడని అంటున్నారు. మొదటి నుంచి తేజు కెరియర్ గ్రాఫ్ ను గమనిస్తూ .. సూచనలిస్తూ వస్తోన్న పవన్, ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి తప్పకుండా వస్తాడనే అంటున్నారు.