ప్రారంభమైన మూడు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రధాన పార్టీలు!
- బీజేపీదే గెలుపంటున్న ఎగ్జిట్ పోల్స్
- గెలుపుపై ఎవరికి వారే ధీమా
- ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశం
మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గాలి బలంగా వీస్తోందని ఎగ్జిట్ పోల్స్ చెప్పుకొచ్చాయి. త్రిపురలో 25 ఏళ్ల వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయమని పేర్కొన్నాయి. మిగత రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని జోస్యం చెప్పాయి. మేఘాలయలో కాంగ్రెస్ పదేళ్లుగా అధికారంలో ఉంది. నాగాలాండ్‌లో మూడు నెలల రాష్ట్రపతి పాలన మినహా 2003 నుంచి నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) అధికారాన్ని చలాయిస్తోంది. అసోం, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ పాగా వేయగా ఈ ఎన్నికల ద్వారా మిగతా ఈశాన్య రాష్ట్రాల్లోనూ విస్తరించాలని బీజేపీ పట్టుదలతో ఉండగా, తమ పట్టును సడలించకూడదని కాంగ్రెస్, వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఉదయం పది గంటలకు తొలి ఫలితం విడుదల కానుండగా మధ్యాహ్నానికి గెలుపెవరిదనేది తేలిపోతుందని చెబుతున్నారు.