శ్రీదేవిపై నాకు ఎలాంటి ద్వేషం లేదు: అర్జున్ కపూర్
- మా నాన్న జీవితంలోకి ఎవరు వచ్చినా గౌరవిస్తా
- శ్రీదేవి అంటే గౌరవం ఉంది
- శ్రీదేవి మరణం తర్వాత అర్జుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే
మరోవైపు, గతంలో ఓ ఇంటర్వ్యూలో అర్జున్ కపూర్ మాట్లాడుతూ, శ్రీదేవిని కానీ, ఆమె కుమార్తెలను కానీ తాను కలిసే ప్రసక్తే లేదని చెప్పాడు. కానీ, శ్రీదేవి మరణం తర్వాత ఆమె మృతిపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెపై తనకు ఎలాంటి ద్వేషం లేదని తెలిపాడు. శ్రీదేవి అంటే తనకు ఎంతో గౌరవమని... తన తండ్రి జీవితంలోకి ఎవరు వచ్చినా గౌరవిస్తానని... అలాగే శ్రీదేవిని కూడా గౌరవిస్తానని చెప్పాడు.