ఇకపై సౌదీ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ కు ఎయిరిండియా విమానాలు!
Add ap7am to your home Screen

ఇకపై సౌదీ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ కు ఎయిరిండియా విమానాలు!

  • తమ దేశ గగనతలంపై భారత విమానాలు వెళ్లొచ్చన్న సౌదీ  
  • ఈ మేరకు ఇజ్రాయెల్ పత్రిక కథనం
  • రెండు గంటలకు పైగా తగ్గనున్న ప్రయాణ సమయం
  • ఇంకా, ధ్రువీకరించని భారత విమానయాన శాఖ, ఎయిర్ ఇండియా అధికారులు
ఇజ్రాయెల్ కు.. అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలకు అస్సలు పడదు. చివరకు, తమ గగనతలం నుంచి కూడా ఇజ్రాయెల్ కు విమానాల రాకపోకలను ఆయా దేశాలు అంగీకరించవు. కానీ, తమ దేశ గగనతలం మీదుగా మన దేశ విమానాలు ఇజ్రాయెల్ కు వెళ్లేందుకు సౌదీ అరేబియా అంగీకరించింది. ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలకు ఈ అనుమతి లభించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ కు చెందిన ఓ పత్రిక వెల్లడించింది.

అయితే, భారత విమానయాన శాఖ గానీ, ఎయిర్ ఇండియా అధికారులు గానీ ఇంకా ధ్రువీకరించలేదు. మార్చి నుంచి ఢిల్లీ-టెల్ అవీవ్ ల మధ్య వారానికి మూడుసార్లు విమానం నడిపేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ను ఎయిర్ ఇండియా అనుమతి కోరిందని, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోను, టెల్ అవీవ్ లోని బెన్ గురియాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోను తమ విమాన సర్వీసులకు స్లాట్ల కోసం ఎదురు చూస్తున్నామని సంబంధిత అధికారి తెలిపారు.

కాగా, ప్రస్తుతం టెల్ అవీవ్ నుంచి ముంబై వచ్చే విమానాలు ఎర్రసముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ మీదుగా చాలా దూరం ప్రయాణించి భారత్ కు రావాల్సి వస్తోంది. సౌదే అరేబియా తమ గగనతలాన్ని ఉపయోగించుకునే అమనుతి ఇవ్వడంతో టెల్ అవీవ్ వెళ్లే ప్రయాణ సమయం దాదాపు రెండున్నర గంటలు తగ్గుతుంది. 
air india
saudi
israel

More Telugu News