రాజకీయాల్లోకి స్టార్ హీరో సూర్య.. నిజమెంత?

Star hero Suriya entering politics how much truth is there
  • స్టార్ హీరో సూర్య రాజకీయ ప్రవేశంపై జోరుగా ప్రచారం
  • అభిమాన సంఘం ప్రతినిధి వ్యాఖ్యలతో మొదలైన ఊహాగానాలు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలను ఖండించిన సూర్య టీమ్
  • ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టీకరణ
  • సేవా కార్యక్రమాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడి
తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్ మరోసారి చర్చనీయాంశమైంది. నటుడు విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీతో విజయవంతం కావడంతో ఇతర స్టార్ హీరోల రాజకీయ ప్రవేశంపై తరచూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో స్టార్ హీరో సూర్య త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారంటూ వచ్చిన వార్తలు కోలీవుడ్ వర్గాల్లో కలకలం రేపాయి. సోషల్ మీడియాలో ఈ ప్రచారం జోరుగా సాగడంతో దీనిపై సూర్య టీమ్ అధికారికంగా స్పందించి పూర్తి స్పష్టత ఇచ్చింది.

అభిమాన సంఘం నేత వ్యాఖ్యలతోనే..
సూర్య ఎన్నో ఏళ్లుగా ‘అగరం ఫౌండేషన్’ ద్వారా విద్యార్థులకు, పేదలకు అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన అభిమాన సంఘాలు కూడా ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాయి. ఇటీవల చెన్నైలో జరిగిన ‘సూర్య అఖిల భారత అభిమానుల పరిరక్షణ సంఘం’ సమావేశంలో సంఘ ప్రతినిధి ఆర్. వీరమణి మాట్లాడుతూ భవిష్యత్తులో సూర్య రాజకీయాల్లోకి రావడం ఖాయమనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని కొన్ని తమిళ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించడంతో సూర్య రాజకీయ అరంగేట్రం వార్త వేగంగా వైరల్ అయింది. విజయ్ తరహాలోనే సూర్య కూడా ప్రజాసేవ నుంచి రాజకీయాల్లోకి వస్తున్నారని అభిమానులు అంచనా వేశారు.

పుకార్లకు తెరదించిన సూర్య టీమ్ 
ఈ ప్రచారం ఊపందుకోవడంతో సూర్య టీమ్ వెంటనే రంగంలోకి దిగింది. సూర్యకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ప్రస్తుతానికి ఎంతమాత్రం లేదని స్ప‌ష్టం చేసింది. అభిమాన సంఘం సమావేశంలో వీరమణి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, వాటితో సూర్యకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

సూర్య నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, సమాజానికి మేలు చేయాలనే స్వచ్ఛమైన ఆశయంతోనే ‘అగరం ఫౌండేషన్’ ద్వారా విద్యార్థుల ఉన్నత చదువులకు సహాయం చేస్తున్నారని వివరించింది. కేవలం సామాజిక బాధ్యతతోనే ఆయన ఈ కార్యక్రమాలు చేపడుతున్నారని, వాటికి రాజకీయ రంగు పులమడం సరికాదని హితవు పలికింది. ఈ ప్రకటనతో సూర్య రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారానికి ప్రస్తుతానికి తెరపడినట్లయింది.
Suriya
Suriya political entry
Tamil Nadu politics
Agaram Foundation
Kollywood news
Vijay Thalapathy

More Telugu News