అంచనాలు పెంచేసిన నోలన్ 'ది ఒడిస్సీ'.. కౌంట్‌డౌన్ ట్రైలర్ వచ్చేసింది!
- క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ఫైనల్ ట్రైలర్ విడుదల
- గ్రీక్ పురాణ గాథ ఆధారంగా యాక్షన్ అడ్వెంచర్ డ్రామా
- ట్రైలర్‌లో గ్రాండ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులు
- ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్
ట్రోజన్ యుద్ధం ముగిశాక ఇథాకా రాజు 'ఒడిస్సియస్' తన రాజ్యానికి, భార్య వద్దకు తిరిగి రావడానికి పదేళ్లపాటు చేసిన ప్రమాదకర ప్రయాణమే ఈ సినిమా కథ. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సముద్రపు తుపానులు, భయంకరమైన రాక్షసులతో పోరాటాలు, యుద్ధ సన్నివేశాలను గ్రాండ్‌గా చూపించారు. నోలన్ మార్క్ విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
ఈ చిత్రంలో ఒడిస్సియస్ పాత్రలో ప్రముఖ నటుడు మాట్ డామన్ నటించగా, అతని భార్య పెనెలోప్ పాత్రలో అన్నే హాత్వే కనిపించనుంది. వీరితో పాటు టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా, షార్లిజ్ థెరాన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఈ నెల 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.