శ్రీవారి సేవలో మంత్రి లోకేశ్‌.. ప్రత్యేక పూజలు

Nara Lokesh visits Tirumala and offers special prayers to Lord Venkateswara
  • టీటీడీ ఛైర్మన్‌, ఈవోలు ఆలయ మర్యాదలతో స్వాగతం
  • తిరుప్పావడ సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు
  • పండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాల అందజేత  
ఆంధ్రప్రదేశ్‌ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ గురువారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయంలోకి చేరుకున్న ఆయనకు టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం మంత్రి లోకేశ్‌ తిరుప్పావడ సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్‌రెడ్డి, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్‌, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శాప్‌ ఛైర్మన్‌ అనిమిని రవినాయుడు, తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుగుణమ్మ, తుడా ఛైర్మన్‌ డాలర్స్‌ దివాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Tirumala Tirupati Devasthanam
Srivari Darshanam
Tiruppavada Seva
Andhra Pradesh IT Minister
BR Naidu

More Telugu News