భానుప్రియ మాజీ భర్త అమెరికాలో గుండెపోటుతో మృతి.. హుటాహుటీన అమెరికాకు పయనం!

  • 1998 జూన్ లో అమెరికా, కాలిఫోర్నియాలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వివాహం చేసుకున్న భానుప్రియ, ఆదర్శ్ కౌశల్
  • 2003లో పాప అభినయ జననం, 2005లో విడాకులు
  • గుండెపోటుతో ఆదర్శ్ కౌశల్ మృతి
ఒక‌ప్ప‌టి అందాల తార భానుప్రియ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె మాజీ భ‌ర్త ఆద‌ర్శ్ కౌశ‌ల్ అమెరికాలో గుండెపోటుతో మ‌ర‌ణించారు. దీంతో భానుప్రియ హుటాహుటీన కుమార్తెతో కలిసి అమెరికా బయల్దేరారు. కాగా, ఫోటోగ్రాఫర్ అయిన ఆదర్శ్ కౌశల్ ను భానుప్రియ 1998 జూన్ లో అమెరికాలోని కాలిఫోర్నియాలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వివాహం చేసుకున్నారు.

2003లో వీరి పండంటి కాపురానికి గుర్తుగా పాప జన్మించింది. పాపకు ఈ దంపతులు అభినయ అని పేరుపెట్టుకున్నారు. అయితే, 2005లో మ‌న‌స్ప‌ర్ధ‌ల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. అనంతరం కుమార్తెను తీసుకుని చెన్నై వచ్చేసిన భానుప్రియ, వివిధ సినిమాల్లో నటిస్తూ, కూచిపూడి, భరతనాట్యంలో ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నారు. 
Go Back to Shorts
bhanupriya
actress
husbend dead

More Telugu News