చిరూ మూవీ టైటిల్ తో 'బిచ్చగాడు' హీరో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరూ మూవీ టైటిల్ తో 'బిచ్చగాడు' హీరో!

  • ఈ నెల 7వ తేదీన సెట్స్ పైకి విజయ్ ఆంథోని
  • తమిళంతో పాటు తెలుగులోను 
  • తెలుగు టైటిల్ గా 'రోషగాడు'
తమిళంలోనే కాదు తెలుగులో కూడా విజయ్ ఆంటోనికి మంచి క్రేజ్ వుంది. 'బిచ్చగాడు' సినిమా ఆయనను తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువ చేసింది. అయితే, ఆ తరువాత వచ్చిన సినిమాలేవీ ఆ స్థాయిలో విజయాలను అందుకోలేదు. అయినా ఆయన తన సినిమాలను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేస్తూ వస్తున్నాడు. సాధారణంగా తమిళంలో సినిమా పూర్తయిన తరువాత తెలుగు టైటిల్ ను ఫిక్స్ చేసే ఆయన, ఈసారి తమిళంతో పాటు తెలుగులోనూ తన తదుపరి సినిమాకి టైటిల్ ను ఫిక్స్ చేశాడు.

 ఈ నెల 7వ తేదీన షూటింగ్ మొదలుకానున్న తన సినిమాకి ఆయన 'రోషగాడు' అనే టైటిల్ ను ఖరారు చేశాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా ఆయన విడుదల చేశాడు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ అనే విషయం పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాకి గణేశ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. విజయ్ ఆంటోని  ఇంతకుముందు చేసిన సినిమాకి చిరంజీవి పాత్ర పేరైన 'ఇంద్రసేన' అనే టైటిల్ పెట్టాడు. ఇప్పుడేమో గతంలో చిరంజీవి చేసిన 'రోషగాడు' టైటిల్ ను ఫిక్స్ చేయడం గమనించదగిన విషయం.
vijay antony

More Telugu News