Mahesh Babu: వంశీ పైడిపల్లితో మహేశ్ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే!

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం మహేశ్ బాబు .. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'భరత్ అనే నేను' అనే టైటిల్ ను ఫిక్స్ చేసి .. ఇటీవల ఫస్టులుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇది మహేశ్ కి 24వ సినిమా .. 25వ సినిమాను ఆయన వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన పనులతో వంశీ పైడిపల్లి బిజీగా వున్నాడు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఏప్రిల్ లో మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అశ్వనీ దత్ .. దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా పూజా హెగ్డే కనిపించనుంది. కథాపరంగా ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా యూఎస్ లో జరుగుతుందట. సంఖ్యాపరంగా మహేశ్ కెరియర్ లో ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకోవడంతో, వంశీ పైడిపల్లి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా సమాచారం. 
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News