తిరుమల దారిలో భారీగా పేలుడు పదార్థాలు.. వణికిపోతున్న భక్తులు

  • కలకలం సృష్టించిన పేలుడు పదార్థాలు
  • భారీగా లభ్యమైన కెపాసిటర్లు, కండెన్సర్లు, సర్క్యూట్ బోర్డులు
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తిరుమల వెళ్లే దారిలో సోమవారం రాత్రి పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. శ్రీవారి మెట్ల దగ్గరి అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన సోదాల్లో ఇవి భారీగా లభ్యమయ్యాయి. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఈ ప్రాంతంలో అవి ఎలా వచ్చాయనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. మెట్ల దారిలో పేలుడు పదార్థాలు లభ్యమైన విషయం తెలిసిన భక్తులు భయంతో వణికిపోతున్నారు.

టాస్క్‌ఫోర్స్ పోలీసుల సోదాల్లో పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే కెపాసిటర్లు, కండెన్సర్లు, సర్క్యూట్ బోర్డులు లభ్యమయ్యాయి. దుండగులు వీటిని ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలకు వెళ్లే దారిలో పటిష్ట భద్రత ఉన్నప్పటికీ వీటిని ఇక్కడి వరకు ఎలా తీసుకురాగలిగారన్న విషయంపై ఆరా తీస్తున్నారు. పోలీసుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
Go Back to Shorts
Tirumala
Tirupati
Walk Way
Police

More Telugu News