gopichand: గోపీచంద్ మూవీ టైటిల్ మారే ఛాన్స్ ..అదీ సెంటిమెంట్ కి కట్టుబడే!

షార్ట్స్‌లో చూడండి
ఫ్యామిలీ ఆడియన్స్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలనే గోపీచంద్ ఎంచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన 25వ సినిమాను చేస్తున్నాడు. కేకే రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి చక్రి దర్శకత్వం వహిస్తున్నాడు. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

గోపీచంద్ తన సినిమాలకు చాలావరకూ సున్నాతో పూర్తయ్యే టైటిల్స్ ను ఎంపిక చేసుకుంటూ ఉంటాడు .. అది ఆయనకు సెంటిమెంట్. అలా ఈ సినిమాకు 'పంతం' అనే టైటిల్ అనుకున్నారు. అయితే ఇదేదో డబ్బింగ్ సినిమా టైటిల్ లా ఉందనే అభిప్రాయాలు ఎక్కువ కావడంతో, 'శపథం' అయితే ఎలా వుంటుందనే ఆలోచన చేస్తున్నారట. దాదాపు ఈ టైటిల్ ఖరారు కావొచ్చని అంటున్నారు. ఈ సినిమా అయినా గోపీచంద్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.     
Go Back to Shorts
gopichand
mehreen

More Telugu News