టీడీపీ వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో.. గుర్రుగా అధిష్ఠానం.. చర్యలకు సిద్ధం!

  • అభ్యంతరకర వీడియోను పోస్టు చేసిన మునిసిపల్ వైస్ చైర్మన్
  • ఆయన తీరుతో పార్టీ పరువు పోయిందన్న నేతలు
  • చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • పరిశీలిస్తున్న అధిష్ఠానం
టీడీపీ వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో ఒకటి కలకలం రేపింది. కాకినాడ మునిసిపల్ వైస్ చైర్మన్ కోరిపూరి రాజు ఈ వీడియోను పోస్టు చేయడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. విషయం అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అశ్లీల వీడియో వ్యవహారం ప్రకంపనలు సృష్టించడంతో రాజు బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లలు పొరపాటున ఆ వీడియోను పోస్టు చేశారంటూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియోను పోస్టు చేసిన రాజుపై చర్యలు తీసుకోవాలంటూ పెద్దాపురం టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆయనను సస్పెండ్ చేయాలని కోరారు. పలువురు పెద్దలు, ముఖ్యనాయకులు ఉండే ఈ గ్రూపులో అభ్యంతరకర వీడియోను ఎలా పోస్టు చేస్తారని రాజును నిలదీశారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చారని మండిపడుతున్నారు. రాజు వ్యవహారంపై అధిష్ఠానం కూడా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. రేపో, మాపో ఆయనపై చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం.
Go Back to Shorts
Telugudesam
Whatsapp
video

More Telugu News