న్యూఇయర్ మెసేజ్‌ల కారణంగా కొన్ని దేశాల్లో మొరాయించిన వాట్సాప్
- ఫిర్యాదులతో నిండిపోయిన ట్విట్టర్
- లాగిన్, కనెక్షన్‌లో సమస్యలు
- స్పందించని వాట్సాప్
తమ సమస్యను ట్వీట్ చేస్తూ #WhatsAppDown అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేశారు. ట్వీట్లు చేసిన వారిలో 54 శాతం మందికి కనెక్టింగ్ సమస్య, 27 శాతం మందికి మెసేజ్ పంపడంలో సమస్య, 17 శాతం మందికి లాగిన్ సమస్యలు తలెత్తినట్లు డౌన్ డిటెక్టర్ పేర్కొంది. అయితే ఈ సమస్యపై వాట్సాప్ అధికారికంగా స్పందించలేదు.