సిరిసిల్ల కలెక్టర్ ట్విట్టర్ రికార్డు.. రెండో స్థానంలో ఆమ్రపాలి
- రాష్ట్రంలో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన కలెక్టర్‌గా రికార్డు
- ప్రజా సమస్యల కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ ఖాతా
- రెండో స్థానంలో వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి
తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న కృష్ణభాస్కర్ అనతికాలంలోనే ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఇటీవల ఓ యువకుడు స్థానిక బస్టాండ్‌లో అపరిశుభ్రతపై ట్వీట్ చేయగా వెంటనే స్పందించిన కలెక్టర్ అధికారులతో మాట్లాడి సమస్యను అప్పటికప్పుడు పరిష్కరించారు. అప్పట్లో ఇది జిల్లాలో హాట్ టాపిక్ అయింది.