charan: 'రంగస్థలం' పుటేజ్ మిస్ అయిందా?

షార్ట్స్‌లో చూడండి
సుకుమార్ .. చరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'రంగస్థలం' .. షూటింగ్ పరంగా చివరి దశకు చేరుకుంది. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా, సాంగ్స్ షూటింగ్ కి వెళ్లడానికి రెడీ అవుతోందట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పూర్తి రషెస్ ను ఇటీవల టీమ్ అంతా కలిసి చూశారట. ఆ సమయంలోనే కొన్ని టెక్నీకల్ ప్రొబ్లమ్స్ వలన హార్డ్ డిస్క్ లోని కొంత ఫుటేజ్ ఎగిరిపోయినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

 చరణ్ .. సమంతా కాంబినేషన్లో చేసిన కొన్ని సీన్స్ .. హార్డ్ డిస్క్ నుంచి ఎగిరిపోయాయని అంటున్నారు. ఆ సీన్స్ ను రీ షూట్ చేయడానికి టీమ్ రెడీ అవుతోందనీ, మళ్లీ కాల్షీట్స్ ఇవ్వడానికి చరణ్ కూడా ఓకే చెప్పేశాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను మార్చి 30వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇంతకుముందే చెప్పారు. జరిగిన సంఘటన ప్రభావం విడుదల తేదీపై పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.    
Go Back to Shorts
charan
sukumar

More Telugu News