ABK Prasad: పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటమే అనవసరం: ఏబీకే ప్రసాద్ కీలక వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటమే అనవసరమని ప్రముఖ సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు ఏబీకే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, జనసేన తాజా పరిణామాలపై ఆయన స్పందించారు. పవన్ ఎప్పుడు నిలబడతాడో, ఎక్కడ నిలబడతాడోనన్నది ఎవరికీ అర్థం కాని విషయమని. అతని గురించి మాట్లాడడమే అనవసరమని అన్నారు.
కొంతమంది లేస్తే మనిషిని కాదని చెబుతుంటారని, పవన్ కల్యాణ్ కు లేవడమే గగనమైపోయిందని అభిప్రాయపడ్డారు. జగన్ పాదయాత్రపై స్పందించిన ఆయన, వైఎస్ పాదయాత్ర చేస్తున్నప్పుడు వచ్చిన ప్రజా స్పందనతో పోలిస్తే, అధికంగా ప్రజలు వస్తున్నారని అన్నారు. పరిపాలకులుగా ఎవరున్నా ఓట్ల కోసం ఇచ్చిన హామీలను అమలు చేయడమే అసలైన పరీక్షని పేర్కొన్నారు.