అమెరికా-ఇరాన్ చర్చలకు డెడ్‌లైన్.. ఆ రోజే ఆఖరి గడువు
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు గడువు
- జులై 15 లోగా ఒప్పందం పూర్తి
- హర్మూజ్ జలసంధి వివాదంపైనే ప్రధాన దృష్టి
- లెబనాన్ సంక్షోభం, ప్రాంతీయ భద్రతపై చర్చలు
అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులు, లెబనాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో ఈ ముందడుగు పడింది. ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి ఇరు దేశాల ఉన్నత స్థాయి సాంకేతిక బృందాలు ఒక నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. నిర్ణీత గడువులోగా ఇరు పక్షాలు ఒక సయోధ్యకు రాకపోతే ప్రాంతీయ భద్రత మరింత క్షీణించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఈ చర్చలలో ప్రధానంగా హర్మూజ్ జలసంధిలో నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇవ్వడం, లెబనాన్ సంక్షోభాన్ని తగ్గించడంతో పాటు ఆర్థిక ఆంక్షల సడలింపు వంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య క్షిపణి దాడులు జరిగినప్పటికీ, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికే ఇరుపక్షాలు మొగ్గు చూపుతున్నాయి.