varun tej: 'తొలిప్రేమ' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు

షార్ట్స్‌లో చూడండి
వరుణ్ తేజ్ తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ .. ఒక్కో సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా .. సినిమాకి కొత్తగా కనిపించేలా .. కొత్తగా అనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అలా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన 'తొలిప్రేమ' సినిమా చేశాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో రాశి ఖన్నా కథానాయికగా నటించింది.

 ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. రీసెంట్ గా వదిలిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, ఫస్టు టీజర్ కి రంగాన్ని సిద్ధం చేశారు. రేపు ఉదయం 10 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను కూడా విడుదల చేశారు.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను, ఫిబ్రవరి 9వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ను ఇస్తుందనే నమ్మకంతో వరుణ్ తేజ్ వున్నాడు.     
Go Back to Shorts
varun tej
rashi khanna

More Telugu News