చిరు దరహాసంతో విక్టరీ సంకేతం చూపుతూ పార్లమెంట్ లోకి వెళ్లిన ప్రధాని!

  • ఫలితాలపై ప్రధాని హర్షం
  • విజయ సంకేతం చూపిన నరేంద్ర మోదీ
  • గుజరాత్, హిమాచల్ లలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండు రాష్ట్రాల్లో ఫలితాలు తమకు అనుకూలంగానే రానున్నాయన్న ఆనందం ప్రధాని నరేంద్ర మోదీ కళ్లలో స్పష్టంగా కనిపించింది. ఈ ఉదయం పార్లమెంట్ కు వచ్చిన ఆయన ఫలితాలపై తన హర్షాన్ని తెలియజేస్తూ, విక్టరీ సంకేతాన్ని చూపించారు. చిరు దరహాసంతో విజయ సంకేతాన్ని చూపుతూ పార్లమెంట్ లోపలికి వెళ్లారు.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. గుజరాత్ లో 14 జిల్లాల్లో బీజేపీ, 13 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. ఆరు జిల్లాల్లో రెండు పార్టీల మధ్యా హోరాహోరీ పోరు సాగుతోంది. అహ్మదాబాద్, బనస్కంత, భావ్ నగర్, చోటా ఉదయ్ పూర్, గాంధీనగర్, జామ్ నగర్, నవ్ సారీ, రాజ్ కోట్, సూరత్, వల్సాద్, అర్వలి, భరూచ్, వడోదర జిల్లాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇదే సమయంలో ఆనంద్, దంగ్స్, కచ్, మోర్టీ, పఠాన్, తాపి, అమ్రేలీ, ద్వారక, గిర్ సోమ్ నాథ్, జునాగఢ్, పంచమహల్, పోర్ బందర్, సబర్కంత జిల్లాల్లో కాంగ్రెస్ ముందంజలో సాగుతోంది.
Go Back to Shorts
Gujarath
BJP
Congress
Election

More Telugu News