డక్కౌట్ అయిన కార్తీక్... తల పట్టుకుని కూర్చున్న రోహిత్ శర్మ!
- మూడో వికెట్ కోల్పోయిన భారత్
- ఎల్బీ రూపంలో కార్తీక్ అవుట్
- మూడంకెల స్కోరు లేకుండానే 3 వికెట్లు డౌన్
ఇప్పటికే పెవీలియన్ కు చేరిన కెప్టెన్ రోహిత్ శర్మ, కార్తీక్ అవుట్ అయిన తీరు చూసి తలపట్టుకుని కూర్చున్న దృశ్యాలు లైవ్ లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయ్యర్ కు తోడుగా ఎంకే పాండే క్రీజులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో భారత్ నిలవాలంటే, వీరిద్దరిలో ఒకరు బ్యాటింగ్ చేయాల్సి వుండగా, మరో వికెట్ కోల్పోతే మాజీ కెప్టెన్ ధోనీ, ఆపై పాండ్యా బ్యాటింగ్ లైన్ లో ఉన్నారు. ఆపై మిగిలినదంతా బౌలర్లే కావడంతో భారమంతా ఈ నలుగురి పైనే ఉన్నట్టు.