నేటి వన్డేలో ధోనీ బౌలింగ్ చేయనున్నాడా?: నెట్స్‌లో శ్రమించిన ఎంఎస్
- భారత్-శ్రీలంక మధ్య నేడు తొలి మ్యాచ్
- ధోనీ బౌలింగ్ చేసే అవకాశం
- రోజంతా లెగ్-స్పిన్ ప్రాక్టీస్ చేసిన మాజీ సారథి
కాగా, తొలి వన్డే ప్రారంభానికి ముందే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ జట్టు నుంచి వైదొలిగాడు. ఈ సిరీస్‌లో అతడు ఆడే అవకాశం లేదు. కేదార్ స్థానంలో తమిళనాడు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ని జట్టులోకి తీసుకున్నారు. కాగా, టీమిండియా మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ శనివారం నెట్స్‌లో లెగ్ స్పిన్ బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేశాడు. దీంతో నేటి మ్యాచ్‌లో ధోనీ బౌలింగ్ చేసే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.