Cricket: పోరాడుతున్న శ్రీలంక... సెంచరీతో ఆకట్టుకున్న డిసిల్వా!

ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న చివరిదైన మూడోటెస్టు చివరి రోజు ఆటలో విజయం కోసం టీమిండియా, ఒటమిని తప్పించుకునేందుకు శ్రీలంక జట్టు చెమటోడుస్తున్నాయి. కట్టుదిట్టమైన బంతులతో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లంకేయుల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆట ఆరంభంలోనే మాథ్యూస్ (1) ను జడేజా పెవిలియన్ కు పంపాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ చండీమాల్ అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న ధనుంజయ డిసిల్వాతో కలిసి శ్రీలంకను ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ నిలకడ ప్రదర్శించారు. ఈ క్రమంలో డిసిల్వా (110) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం అద్భుతమైన ఓవర్ తో విసిగించిన అశ్విన్, ఊరించే బంతితో చండీమాల్ (36) ను పెవిలియన్ కు పంపాడు. అనంతరం సిల్వా (24) జాగ్రత్తగా ఆడుతున్నాడు. దీంతో శ్రీలంక జట్టు 70 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. 
Cricket
Sri Lanka
India

More Telugu News