నాకు మూడు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి...!: నమిత
- లవ్ ఫెయిల్యూర్స్ వల్ల చాలా తెలుసుకున్నాను
- వీర్ ప్రపోజల్ ను తిరస్కరించేందుకు ఒక్క కారణం కూడా కనబడలేదు
- భర్త, అత్తమామలు రూల్స్ పెట్టలేదు
ఒకవేళ ఆయన ప్రపోజ్ చేయకపోయి ఉంటే, తానే ప్రపోజ్ చేసి ఉండేదానినని నమిత తన మనసులోని మాటను వెల్లడించింది. పెళ్లి తరువాత తన జీవితంలో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదని, అయితే మెడలో మంగళసూత్రం, కాలికి మెట్టెలు మాత్రం కొత్తగా వచ్చాయని చెప్పింది. అంతే తప్ప సంప్రదాయం పేరుతో కుంకుమ బొట్టు పెట్టుకో, చీరకట్టుకో అంటూ భర్త కానీ, అత్తమామలు కానీ తనపై ఎటువంటి నిబంధనలూ పెట్టలేదని తెలిపింది.