sri vishnu: శ్రీవిష్ణుకి పెరుగుతోన్న అవకాశాలు .. కొత్త చిత్రం 'తిప్పరా మీసం'!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై దూకుడు చూపిస్తోన్న యువ కథానాయకుల జాబితాలో శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు. ఒక్కో సినిమాకి ఆయన తన క్రేజ్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న ఆయన, ఆ తరువాత 'ఉన్నది ఒకటే జిందగీ'తో ప్రేక్షకుల మనసుకు మరింత దగ్గరయ్యాడు.

ఇక రీసెంట్ గా వచ్చిన 'మెంటల్ మదిలో' ఆయనని పూర్తిస్థాయి హీరోగా నిలబెట్టేసింది. ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ మార్క్స్ కొట్టేసిన ఆయనకి అవకాశాలు వరుసబెడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన దర్శకుడు విజయ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో విజయ్ .. నారా రోహిత్ హీరోగా 'అసుర' సినిమా చేశాడు. ఇటీవల ఆయన శ్రీవిష్ణుకి కథ చెప్పేసి ఓకే అనిపించేసుకున్నాడు. ఈ సినిమాకి 'తిప్పరా మీసం' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.  
Go Back to Shorts
sri vishnu
vjay

More Telugu News