ఒకప్పుడు లక్ష్మణ్, భజ్జీ ఉన్నారన్న ధైర్యంతో ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేవాళ్లం.. ఇప్పుడు కోహ్లీ వున్నాడు!: గంగూలీ
- కోహ్లీ అందరికి రోల్ మోడల్
- ధోనీ జట్టుని మరింత ఉన్నతికి తీసుకెళ్లాడు
- టీమిండియా ఒక్కో మెట్టు ఎక్కుతూ వృద్ధి చెందుతోంది
అయితే భారత క్రికెట్ లో ఉన్న గొప్పదనం ఏమిటంటే... ఇక్కడ ప్రతి విభాగంలోనూ రోల్ మోడల్స్ ఉన్నారని తెలిపాడు. వారినుంచి స్పూర్తిని పొందుతూ భారత క్రికెట్ ఒక్కోమెట్టు ఎక్కుతూ వస్తోందని ఆయన తెలిపాడు. ఇప్పుడు అందరికీ రోల్ మోడల్ కోహ్లీ అని గంగూలీ చెప్పాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగే 2019 వరల్డ్ కప్ గెలిస్తే...కోహ్లీ ఆక్స్ ఫర్డ్ వీధుల్లో చొక్కా విప్పి ఆనందంగా తిరగాలని గంగూలీ చమత్కరించాడు. కాగా, నాట్ వెస్ట్ సిరీస్ గెలిచిన సందర్భంగా లార్డ్స్ లో గంగూలీ చొక్కా విప్పి గాల్లో తిప్పిన సంగతి తెలిసిందే.