జోరు కొనసాగిస్తున్న టీమిండియా.. విజయ్, కోహ్లీ సెంచరీలు!

  • మూడో టెస్టులో టీమిండియా దూకుడు
  • సెంచరీలతో కదంతొక్కిన మురళీ విజయ్, విరాట్ కోహ్లీ
  • భారీ స్కోరు దిశగా టీమిండియా
అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడు కొనసాగుతోంది. శ్రీలంకతో గత టెస్టులో డబుల్ సెంచరీతో కదంతొక్కిన కోహ్లీ చివరిదైన మూడో టెస్టులో కూడా సత్తా చాటుతున్నాడు. మరోవైపు మురళీ విజయ్ సెంచరీ (122) తో ఆకట్టుకున్నాడు.

శిఖర్ ధావన్ (23), ఛటేశ్వర్ పుజారా (23)లు కాకతాళీయంగా ఒకే స్కోరు వద్ద అవుటవడం విశేషం. దీంతో బరిలోకి దిగిన కోహ్లీ (106) దూకుడుగా ఆడాడు. ఒకరి తరువాత ఒకరు సెంచరీ మైలురాయిని దాటారు. దీంతో టీమిండియా మరోసారి శ్రీలంకకు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించే స్థాయికి చేరుకుంటోంది. 65 ఓవర్లు ఆడిన టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో పెరీరా, గమగే చెరొక వికెట్ తీశారు. 
Go Back to Shorts
Cricket
srilanka
team india

More Telugu News