'సన్నాఫ్ సత్యమూర్తి'లో ఉపేంద్ర పాత్రకి ముందుగా నన్ను అనుకున్నారట: రాజశేఖర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సన్నాఫ్ సత్యమూర్తి'లో ఉపేంద్ర పాత్రకి ముందుగా నన్ను అనుకున్నారట: రాజశేఖర్

  • 'గరుడ వేగ' సక్సెస్ ఆనందాన్నిచ్చింది 
  • ఇకపై విలన్ గా చేయడానికి రెడీ 
  • ముఖ్యమైన పాత్రలను కూడా చేస్తాను 
  • మల్టీ స్టారర్స్  చేయడానికి కూడా ఓకే  
"గరుడ వేగ' హిట్ తరువాత మీరు ఇకపై ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎలాంటి పాత్రలను చేయాలనుకుంటున్నారు?" అనే ప్రశ్న రాజశేఖర్ కి ఎదురైంది. అప్పుడాయన స్పందిస్తూ .. " ఇక మీదట నా ఇమేజ్ కి తగని పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. సాధారణంగా ఒక పెద్ద హిట్ తరువాత ఎవరైనా హీరోగా మాత్రమే చేయాలనుకుంటారు. కానీ నేను అలా అనుకోవడం లేదు" అన్నారు.

"మంచి విలన్ .. ముఖ్యమైన పాత్రలు .. మల్టీ స్టారర్ సినిమాలు వచ్చినా చేయడానికి నేను సిద్ధం. కొత్త జనరేషన్ దర్శకులకి నేను ఎప్పుడూ అందుబాటులో వుంటాను. 'సన్నాఫ్ సత్యమూర్తి'లో ఉపేంద్ర చేసిన పాత్ర నాకు బాగా నచ్చింది. ఆ పాత్రకి ఉపేంద్ర కంటే ముందుగా నన్ను అనుకున్నారట. అయితే అది నా వరకూ రాలేదు .. కారణం తెలియదు. అడిగితే చేసి ఉండేవాడిని .. చాలా మంచి కేరక్టర్ అది. రాజశేఖర్ చాలా బాగా చేశాడు .. అనిపించుకునే పాత్రలను చేయడానికి నేను రెడీగానే వున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.      
rajasekhar

More Telugu News