gopichand: ప్రభాస్ వివాహంపై కామెంట్ చేసిన హీరో గోపీచంద్!

షార్ట్స్‌లో చూడండి
తన చిరకాల మిత్రుడు ప్రభాస్ వివాహం విషయమై హీరో గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ప్రస్తుతం తాను నటించిన 'ఆక్సిజన్' చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న గోపీచంద్, మీడియాతో మాట్లాడుతూ, ఇంతకాలమూ 'బాహుబలి'తో బిజీగా ఉన్నందునే పెళ్లి విషయాన్ని ప్రభాస్ పక్కన బెట్టాడని, ఇప్పుడు కాస్త రిలాక్స్ గా ఉన్నాడు కాబట్టి త్వరలోనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడని చెప్పాడు.

 'ఆక్సిజన్' చిత్రం వెనుక ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఉన్నారని నమ్మి చేశానని, ఈ సినిమా తనలో ఆక్సిజన్ ను నింపుతుందని భావిస్తున్నానని చెప్పాడు. గతంలో విజయం సాధిస్తుందని నమ్మి చేసిన 'సౌఖ్యం' వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయని, కథ బాగుండి, సెట్స్ పైకి వెళ్లిన తరువాత మారిపోవడమే ఇందుకు కారణమని అన్నాడు. ఆ తప్పును వేరేవాళ్లపై రుద్దే ప్రయత్నాలను తాను చేయబోవడం లేదని చెప్పాడు.
Go Back to Shorts
gopichand
prabhas
bahubali

More Telugu News