నాగ్‌పూర్ టెస్టు: కోహ్లీ డ‌బుల్ సెంచ‌రీ

నాగ్‌పూర్ వేదిక‌గా జ‌రుగుతోన్న శ్రీలంక-భార‌త్ టెస్టు మ్యాచులో టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ డ‌బుల్ సెంచ‌రీ బాదాడు. 167.5 ఓవ‌ర్ల వ‌ద్ద సింగిల్‌ చేసి 200 ప‌రుగులు ( 259 బంతుల్లో) పూర్తి చేసుకుని అద‌ర‌హో అనిపించాడు. దీంతో కెప్టెన్‌గా అత్య‌ధిక ద్విశ‌త‌కాలు చేసిన లారాతో కోహ్లీ స‌మంగా నిలిచాడు.

కోహ్లీ దూకుడుకి తోడు ముర‌ళీ విజ‌య్ (128), చ‌టేశ్వ‌ర్ పుజారా (143) అద్భుతంగా రాణించ‌డం, క్రీజులో రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టికే హాఫ్ సెంచ‌రీ చేసి ఉండ‌డంతో టీమిండియా భారీ స్కోరు దిశ‌గా దూసుకెళుతోంది. టెస్టుల్లో కోహ్లీకి ఇది ఐదో ద్విశ‌త‌కం. ప్ర‌స్తుతం టీమిండియా స్కోరు 568/4 (168 ఓవ‌ర్ల‌కి) గా ఉంది.
Go Back to Shorts
Virat Kohli
Cricket
India
Sri Lanka

More Telugu News