శ్రీలంక ఆలౌట్... ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయిన భారత్!
- 205 పరుగులకు శ్రీలంక ఆలౌట్
- టాప్ స్కోరర్ చండిమల్ (57)
- 7 వికెట్లను కూల్చిన స్పిన్నర్లు
తిరిమన్నె, చండిమల్, షనక, హెరాత్ లను అశ్విన్ ఔట్ చేయగా... మ్యాథ్యూస్, డిక్ వెల్లా, పెరీరాలను జడేజా బలిగొన్నాడు. ఓపెనర్లు సమరవిక్రమ, కరుణరత్నే లతో పాటు లక్మల్ లను ఇషాంత్ ఔట్ చేశాడు.
అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ ను ప్రారంబించింది. కేఎల్ రాహుల్, మురళీ విజయ్ లు ఇన్నింగ్స్ ను ఆరంభించారు. తొలి బంతినే బౌండరీగా మలిచిన రాహుల్ 7 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. గమాగే బౌలింగ్ లో ఔట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వెళ్తున్న బంతిని రాహుల్ ఆడబోగా... ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను గిరాటేసింది. మరో ఎండ్ లో ఉన్న విజయ్ ఇంకా ఖాతాను ఆరంభించలేదు. భారత్ ప్రస్తుత స్కోరు 3.5 ఓవర్లకు 7 పరుగులు.