ఫస్ట్ స్లిప్ లో పుజారా అద్భుత విన్యాసం.. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక

నాగపూర్ లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో 20 పరుగుల వద్ద ఓపెనర్ సమరవిక్రమ (13 పరుగులు, 15 బంతులు, 1 ఫోర్) ను ఇషాంత్ శర్మ పెవిలియన్ చేర్చాడు. 139 కిలోమీటర్ల వేగంతో ఇషాంత్ సంధించిన ఫుల్ డెలివరీ ఔట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వైపు స్వింగ్ అయింది. ఆ బంతిని మిడ్ ఆఫ్ మీదుగా సమరవిక్రమ ఆడబోగా, బంతి ఎడ్జ్ తీసుకుంది. ఫస్ట్ స్లిప్ వైపు వెళ్లిన బంతిని పుజారా ఎడమవైపుకు అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ ను అందుకున్నాడు. దీంతో శ్రీలంక పతనం ఆరంభమైంది. మరో వైపు, కరుణరత్నే 7 పరుగులతో ఆడుతున్నారు. తిరిమన్నే క్రీజులోకి వచ్చాడు. 
Go Back to Shorts
second test
team india
sri lanka cricket

More Telugu News