బాబా రామ్‌దేవ్ జీవిత క‌థ ఆధారంగా టీవీ సిరీస్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాబా రామ్‌దేవ్ జీవిత క‌థ ఆధారంగా టీవీ సిరీస్‌!

  • యోగా గురువు పాత్రలో న‌టించనున్న మోహిత్ రైనా
  • డిస్క‌వ‌రీ వారి కొత్త ఛాన‌ల్ `జీత్‌`లో ప్ర‌సారం
  • 'స్వామి బాబా రామ్‌దేవ్: ది అన్‌టోల్డ్ స్టోరీ' పేరుతో షో
యోగా గురువు బాబా రామ్‌దేవ్ జీవిత క‌థ ఆధారంగా ఓ టీవీ సిరీస్ రానుంది. 'స్వామి బాబా రామ్‌దేవ్: ది అన్‌టోల్డ్ స్టోరీ' పేరుతో రానున్న ఈ సిరీస్‌లో రామ్‌దేవ్ పాత్రలో ప్ర‌ముఖ టీవీ న‌టుడు మోహిత్ రైనా న‌టించ‌నున్నాడు. ఈ కార్య‌క్ర‌మంలో రామ్‌దేవ్‌లో బాల్యం నుంచి యోగా, ఆధ్యాత్మిక‌తల‌ వైపుకు బాట‌లు ప‌డిన అంశాల‌ను చూపించ‌నున్నారు. గ‌తంలో 'దేవోంకా దేవ్ మ‌హాదేవ్‌' సీరియ‌ల్‌లో త‌న న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు అందుకున్న మోహిత్, రామ్‌దేవ్ పాత్రలో న‌టించేందుకు అప్పుడే క‌స‌ర‌త్తులు కూడా ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది.

డిస్క‌వ‌రీ నెట్‌వ‌ర్క్ వారు త్వ‌ర‌లో ఆవిష్క‌రించ‌బోతున్న 'జీత్‌' అనే హిందీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్‌లో ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానుంది. మోహిత్‌తో పాటు అనాస్ ర‌షీద్, క‌విత కౌశిక్‌లు ఇందులో న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ కార్య‌క్ర‌మంతో పాటు 'జీత్' ఛాన‌ల్‌లో స‌రాగ్ర‌హి- ఇండియాస్ బ్రేవెస్ట్ డే, గ్యాంగ్స్ ఆఫ్ ముంబై, గ‌బ్రూ: ద బ‌ర్త్ ఆఫ్ హిప్ హాప్ కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం కానున్నాయి.
baba ramdev
yoga
mohit raina
discovery
jeet

More Telugu News