25వ సినిమాతోను గోపీచంద్ సాహసమే చేస్తున్నాడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

25వ సినిమాతోను గోపీచంద్ సాహసమే చేస్తున్నాడు

  • చక్రి దర్శకత్వంలో గోపీచంద్ 
  • ఆయనకి ఇది 25వ సినిమా 
  • వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్
మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ వున్న కథానాయకుడిగా గోపీచంద్ గురించి చెప్పుకోవచ్చు. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీతోను ప్రేక్షకులను మెప్పించే గోపీచంద్ కి కొంతకాలంగా సరైన హిట్ పడటం లేదు. దాంతో ఆయన అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అలాంటి హిట్ ఇస్తుందనే నమ్మకంతోనే చక్రి దర్శకత్వంలో కొత్త సినిమాను మొదలుపెట్టాడు. 'జై లవ కుశ' సినిమాకి అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన చక్రి .. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

సాధారణంగా ఏ హీరో అయినా సంఖ్యాపరంగా తన సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. అలా చూసుకుంటే ఇది గోపీచంద్ కి 25వ సినిమా. సంఖ్యా పరంగా ప్రాధాన్యత కలిగిన సినిమాలపై హీరోలు ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. పెద్ద దర్శకుడితో ఆ సినిమా చేయాలనుకుంటారు. కానీ గోపీచంద్ .. ఈ సినిమాతో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడం విశేషం. కంటెంట్ పై నమ్మకంతోనే ఆయన ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఉండొచ్చునని చెప్పుకుంటున్నారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.      
gopichand
mehreen

More Telugu News