సిక్స్ ప్యాక్ సాధించి చూపిన జస్ ప్రీత్ బుమ్రా... ఫిదా అవుతున్న అమ్మాయిలు!

భారత క్రికెట్ టీమ్ లో చేరిన అనతి కాలంలోనే ప్రధాన బౌలర్లలో ఒకడిగా మారిపోయి, ఇండియాలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో ఒకడన్న పేరు తెచ్చుకున్న జస్ ప్రీత్ బుమ్రా, తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకునే క్రమంలో సిక్స్ ప్యాక్ సాధించాడు. తన సిక్స్ ప్యాక్ ను ప్రదర్శిస్తూ, తాజాగా ట్విట్టర్ లో ఓ ఫొటో పెట్టడంతో క్రికెట్ ఫ్యాన్స్ నుంచి లైక్స్, షేర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల నుంచి బుమ్రా సిక్స్ ప్యాక్ ను పొగడుతూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

ఫిట్ నెస్ అంటే ప్రాణం పెట్టే కోహ్లీ స్ఫూర్తితో బుమ్రా ఈ పని చేయగా, ఆయన ప్రేరణతోనే కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలు అదే దారిలో నడుస్తున్నారు. కాగా, తన సిక్స్ ప్యాక్ వెనుక అంకితబావం, నిరంతర శ్రమ ఉన్నాయని, వాటి కారణంగానే తనను తాను ఇంప్రూవ్ చేసుకున్నానని బుమ్రా వ్యాఖ్యానించాడు. బుమ్రా పోస్ట్ చేసిన సిక్స్ ప్యాక్ చిత్రాన్ని మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
bumra
six pack
cricket fans
Virat Kohli

More Telugu News