కోల్‌కతా టెస్టు: మూడోరోజు ముగిసిన ఆట
- టీమిండియా తొలి ఇన్నింగ్స్: 172 (ఆలౌట్)
- ఆటముగిసే సమయానికి శ్రీలంక స్కోరు: 165/4
- క్రీజులో చండిమాల్ (13), డిక్ వెల్లా (14)
టీమిండియా బ్యాట్స్‌మెన్లలో లోకేశ్ రాహుల్ 0, శిఖర్ ధావన్ 8, పుజారా 52, కోహ్లీ 0, రహానె 4, రవిచంద్రన్ అశ్విన్ 4, వృద్ధిమాన్ సాహా 29, రవీంద్ర జడేజా 22, భువనేశ్వర్ కుమార్ 13, షమీ 24, ఉమేశ్ యాదవ్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లో తిరుమన్నే 51, ఏంజెలో మాథ్యూస్ 52, కరుణ రత్నే 8, సమరవిక్రమ 23 పరుగులు చేశారు. క్రీజులో చండిమాల్ 13, డిక్ వెల్లా 14 పరుగులతో ఉన్నారు. వెలుతురు లేమి కారణంగా మ్యాచ్ ను నిర్ణీత వ్యవధి కంటే ముందుగానే నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.