రవితేజ కోసం అనుకున్న కథ గోపీచంద్ కి వెళ్లింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజ కోసం అనుకున్న కథ గోపీచంద్ కి వెళ్లింది!

  • చక్రి దర్శకత్వంలో గోపీచంద్ 
  • గతంలో రవితేజకి వినిపించిన కథే  
  • కథానాయికగా మెహ్రీన్ 
  • రేపు ఉదయం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం    
చక్రి అనే దర్శకుడు రవితేజతో ఒక సినిమా చేయాలనుకున్నాడు. 'రాబిన్ హుడ్' అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు కూడా చేసుకున్నాడు. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం చక్రి .. గోపీచంద్ తో ఓ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. రవితేజకి చెప్పిన కథనే గోపీచంద్ కి చెప్పి ఒప్పించాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

అయితే 'రాబిన్ హుడ్' కాకుండా మరో టైటిల్ పెట్టే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో 'బెంగాల్ టైగర్' ను నిర్మించిన రాధామోహన్, ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ ను తీసుకున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. దిల్ రాజు .. వినాయక్ .. సురేందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు సమాచారం.    
gopichand
mehreen

More Telugu News