దర్శకురాలిగా జీవిత ఎప్పుడూ ఓడిపోలేదు!: రాజశేఖర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దర్శకురాలిగా జీవిత ఎప్పుడూ ఓడిపోలేదు!: రాజశేఖర్

  • ఆ సినిమాలు ఆడకపోవడానికి జీవిత కారణం కాదు   
  • శేషు రీమేక్ చూసి ఒరిజినల్ డైరెక్టర్ బాలా గారు ఆమెను అభినందించారు  
  • 'ఎవడైతే నా కేంటి' హిట్ అన్న రాజశేఖర్   
ఒక వైపున మాస్ ఆడియన్స్ లో మంచి మార్కులు తెచ్చుకున్న రాజశేఖర్ .. మరో వైపున ఫ్యామిలీ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి రాజశేఖర్ .. కొన్ని రీమేక్ సినిమాలను జీవిత దర్శకత్వంలో చేశారు. ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి కారణం ఆమెనే అనే టాక్ ఉండేది. అదే విషయాన్ని ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తే .. అందులో ఎంతమాత్రం నిజం లేదంటూ రాజశేఖర్ ఖండించారు.

 'శేషు' ఒరిజినల్ డైరెక్టర్ బాలా గారు జీవిత చేసిన రీమేక్ చూసి ఆమెను అభినందించారు. సాధారణంగా ఆయన ఒక పట్టాన ఎవరినీ మెచ్చుకోరు. ఉన్నది వున్నట్టుగా ముఖాన చెప్పేస్తుంటారు. అలాంటి బాలా గారు ఆ సినిమాను ఆమె చాలా బాగా తీసిందని ప్రెస్ షో లో చెప్పారు. అలాగే తెలుగులోని కొంతమంది దర్శకులు కూడా జీవితను ప్రశంసించారు. ఆ సినిమాలు ఆడకపోవడానికి వేరే కారణాలు వున్నాయి. ఇక జీవిత దర్శకత్వం వహించిన 'ఎవడైతే నా కేంటి' మంచి హిట్ అయిందనే విషయాన్ని మరిచిపోకూడదు. నాకు తెలిసి దర్శకురాలిగా ఆమె ఎప్పుడూ ఓడిపోలేదు" అని రాజశేఖర్ చెప్పారు.    
rajasekhar
jeevita

More Telugu News