rajasekhar: అలీ హర్ట్ అవుతాడనే ఉద్దేశంతోనే 'గబ్బర్ సింగ్'లో సెటైర్ గురించి అడగలేదు : రాజశేఖర్

షార్ట్స్‌లో చూడండి
"అలీతో మీరు సరదాగా .. ఫ్రెండ్లీగా వుంటారు. 'గబ్బర్ సింగ్'లో పవన్ కల్యాణ్ మీ పైన సెటైర్లు వేసిన దాంట్లో అలీ కూడా ఒక పార్టే. అలీ అటు పవన్ తోను .. ఇటు మీ తోను క్లోజ్ గా వున్నారు .. ఇండస్ట్రీలో ఇది ఎలా సాధ్యం?" అనే ప్రశ్న తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో రాజశేఖర్ కి ఎదురైంది.

అందుకాయన స్పందిస్తూ .. "నిజానికి నేను అలీపై కోప్పడి ఉండాలి. పవన్ కల్యాణ్ చెప్పారని మీరు కూడా కలిసి చేశారు గదా అని ఉండాలి. ఒక సందర్భంలో పవన్ కల్యాణ్ గురించి నేను మాట్లాడాను .. అందుకు బదులుగా పవన్ ఆ సీన్ ను ఆ సినిమాలో పెట్టారు. నిజంగా నేను చాలా ఫీలయ్యాను .. "వద్దు .. ఆయన నాకు మంచి ఫ్రెండ్ .. ఎవైడ్ చేద్దాం" అని అలీ చెప్పి వుండాల్సింది. అది నా మనసులో వుంది..  అయినా అలీ గారిని కలిసినప్పుడు అడగలేదు. దాని గురించి మాట్లాడితే ఆయన హర్ట్ కావొచ్చు .. వున్న రిలేషన్ షిప్ చెడిపోవచ్చు .. అందుకే అడగాలనిపించినా అడగలేదు" అని చెప్పుకొచ్చారు.   
Go Back to Shorts
rajasekhar
jeevitha

More Telugu News